SKN: ఇంత మంది తెలుగు హీరోయిన్ లను పరిచయం చేసా: బేబీ నిర్మాత 1 y ago
తాను చేసిన కామెంట్స్ పై బేబీ నిర్మాత 'ఎస్కేఎన్' స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. 'ఇకపైన తెలుగు అమ్మాయిలతో సినిమాలు చేయడని.. నాపై పలు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో రేష్మ , ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య వంటి 8 మంది తెలుగు హీరోయిన్ లను పరిచయం చేశాను. నా కెరీర్ లోని నేను వర్క్ చేసిన 80% అమ్మాయిలు తెలుగు వారే. వివిధ విభాగాల్లో 25మంది తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలనీ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. అటువంటిది నేను సరదాగా చేసిన వ్యాఖ్యలని తప్పుగా ప్రచారం చేయొద్దని కోరుతున్నాను' అని విజ్ఞప్తి చేశారు.